హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కారు జోరు కాస్త తగ్గింది. సైకిల్ తుస్సుమంది. మొదటి స్థానంలో కాంగ్రెస్ నిలవగా, టీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 53 మున్సిపాలిటీలకు, మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 53 మున్సిపాలిటీల్లో... కాంగ్రెస్ -21, టీఆర్‌ఎస్ -8, టీడీపీ -3, బీజేపీ -2, ఎంఐఎం -2, బీఎస్పీ -1, హంగ్ -18. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా 104 వార్డుల్లో గెలుపొందగా, ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా 25 వార్డుల్లో గెలుపొందింది. కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా 83 వార్డుల్లో గెలుపొందగా, ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా 5 వార్డుల్లో గెలిచింది.
మూడు కార్పోరేషన్లలో.... కరీంనగర్ కార్పోరేషన్‌ను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పోరేషన్‌లో హంగ్ ఏర్పడింది. ఈ కార్పోరేషన్‌లో ఎంఐఎం-16, కాంగ్రెస్ -16, టీఆర్‌ఎస్-10, బీజేపీ-6, ఇతరులు -2 స్థానాల్లో గెలుపొందారు. రామగుండం కార్పోరేషన్లలోనూ హంగ్ ఏర్పడింది. ఈ కార్పోరేషన్‌లో టీఆర్‌ఎస్ -14, కాంగ్రెస్ -19, ఇతరులు -17 స్థానాల్లో గెలుపొందారు. ఇతరుల్లో ఎక్కువగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే ఉన్నారు.

0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !