పవన్‌కల్యాణ్ కొత్త పార్టీ? - TELUGU WATCH
Headlines News :

.

Home » , » పవన్‌కల్యాణ్ కొత్త పార్టీ?

పవన్‌కల్యాణ్ కొత్త పార్టీ?

Written By BLOGGEr on Sunday, May 11, 2014 | 2:41 PM

-పేరు పవన్ రిపబ్లిక్ పార్టీ!..
-11న ఆవిర్భావ ప్రకటన!!

హైదరాబాద్, మార్చి 4 (టీ మీడియా): కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి తమ్ముడు, ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్ కొత్తపార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు పవన్ రాజకీయాల్లో అడుగుపె బ్యాక్‌గ్రౌండ్ సిద్ధం చేసుకున్నట్టు సినీ, రాజకీయ వర్గాల్లో రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. పవన్ ఈ నెల 11న పార్టీ ప్రకటన చేస్తారని, తన పేరు, తన అన్న చిరంజీవి స్థాపించి కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రజారాజ్యం పేరు కలిసి వచ్చేట్టుగా పీఆర్పీ (పవన్ రిపబ్లికన్ పార్టీ)గా నామకరణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రాజకీయాలపై పవన్‌కు ఆసక్తి ఉన్నదని గ్రహించిన పార్టీలు ఇప్పటికే తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించాయి. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్‌తో ప్రచారం చేయిస్తే నాలుగు ఓట్లు రాలుతాయనే ఆలోచనతో ఆయనను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. 
పైగా చిరంజీవికి, పవన్‌కళ్యాణ్‌కు మధ్య విభేధాలున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఆసరా చేసుకొని పవన్‌కల్యాణ్‌ను ఆకర్షించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిన మరుక్షణమే టీడీపీలోకి రావాల్సిందిగా ఆ పార్టీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆహ్వానించారు. మరోవైపు లోక్‌సత్తా పార్టీ కూడా ఆయనకు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టికెట్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు తెలిసింది. పవన్ మాత్రం ఇటీవల ప్రజారాజ్యం నుంచి వెళ్లిన కొంతమంది నేతలతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆయన రాజకీయాల్లోకి రానున్నారని రామచంద్రాపురం ఎమ్మెల్యే త్రిమూర్తులు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత తెలిపారు. వీరిద్దరి సలహాతోనే పవన్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కొత్త పార్టీ పెడతారా? లేక ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారా? అన్న దానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ ప్రకటిస్తే ఇరువూపాంతాలైన తెలంగాణ, సీమాంధ్రకు వర్తించేలా ఎజెండా ఖరారు చేస్తారా? సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకుని ఊరేగుతారా? అనే ప్రశ్నలు షికారుచేస్తున్నాయి.



Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template