ప్రతి నిమిషం దేశం కోసం బతకాలి : మోడీ - TELUGU WATCH
Headlines News :

.

Home » » ప్రతి నిమిషం దేశం కోసం బతకాలి : మోడీ

ప్రతి నిమిషం దేశం కోసం బతకాలి : మోడీ

Written By BLOGGEr on Tuesday, May 20, 2014 | 7:34 AM

న్యూఢిల్లీ : ఈ దేశం కన్నతల్లి లాంటదని, ప్రతి నిమిషం దేశం కోసం బతకాలని ఎన్‌డీఏ పక్షాలకు కాబోయే దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు. దేశం కోసం సేవ చేసే భాగ్యం పార్టీవల్లే దక్కిందని, పార్టీకూడా తనకు కన్నతల్లి లాంటిదేనని మోడీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలనుద్దేశించి మోడీ మాట్లాడారు. ప్రసంగం మధ్యలో మోడీ కాస్త బావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంటులోకి అడుగు పెడుతున్న సందర్భంగా మెట్లపై సాష్టాంగ పడి దేశ పార్లమెంటుకు నమస్కరించారు. అనంతరం ఎల్‌కే అద్వానీకి పాదాబివందనం చేశారు.

ఇది ప్రజాస్వామ్యదేశమని, 2013 సెప్టెంబర్ 13న తనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారని, సెప్టెంబర్ 15న పని ప్రారంభిచానని మోడీ తెలిపారు. వంద కోట్ల మంది అకాంక్షలను నెరవేర్చే అత్యంత గొప్ప బాధ్యత తనపై ఉందని, దేశ అభివృద్ధికి అహర్నిషలూ పాటుపడతానని మోడీ హామీ ఇచ్చారు. అద్వానీ, రాజ్‌నాథ్‌లవల్లే తాను ఇక్కడున్నానని, ఒక పేద వ్యక్తి ఈ స్థానంలో నిలబడ్డాడంటే ఇది ప్రజాస్వామ్య ఘనతేనని మోడీ అన్నారు. తాను ఆశావాదినని, తనకు సమర్థవంతమైన నాయకులు దొరికారని, దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతానని మోడీ తెలిపారు.


Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template