పార్టీ ఓటమికి నాదే పూర్తి బాధ్యత: జేపీ - TELUGU WATCH
Headlines News :

.

Home » » పార్టీ ఓటమికి నాదే పూర్తి బాధ్యత: జేపీ

పార్టీ ఓటమికి నాదే పూర్తి బాధ్యత: జేపీ

Written By BLOGGEr on Sunday, May 18, 2014 | 7:16 AM

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. ఓటమికి గల కారణాలను పార్టీలో అంతర్గతంగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఓటమిపై జాతీయ కార్యవర్గం తీసుకునే నిర్ణయంపై తన రాజీనామా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. లోక్‌సత్తా జాతీయ రాజకీయాల నుంచి ఎక్కడికీ పారిపోదని తెలిపారు. కేంద్రంలో సుస్థిర పాలన సాధించేందుకు ప్రజలు అవకాశమిచ్చారని అన్నారు. 

కేంద్రంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలు యువత ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రయత్నించాలని కోరారు. యువత భవిష్యత్ కోసం తీసుకునే చర్యలను చేతల్లో చూపించాలని అన్నారు. 1971 తర్వాత ప్రజలు స్పష్టమైన అజెండా ఇవ్వడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని తెలిపారు.



Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template