సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'విక్రమసింహా'(తమిళంలో 'కొచ్చడయాన్'). రజనీకాంత్ కుమార్తె దర్శాకత్వంలో తెరకెక్కుతుంది. మీడియావన్ గ్లోబెల్ లిమెటెడ్, ఇరోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇటీవలే ఆడియో విడుదల కూడా జరిగింది. అస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఈ ఆడియో విడుదల చేశారు.
ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా అనుకున్న తేదిన విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే 16న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఈ టెక్నాలజీ కారణంగానే తలనొప్పులు వచ్చి విడుదల ఆలస్యం అవుతుందని మరో వర్గం వారు అరోపిస్తున్నారు. మరి మే 16న విడుదలకి సిద్ధమవుతుందా? చూడాలి




0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !