ఏప్రిల్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి! - TELUGU WATCH
Headlines News :

.

Home » » ఏప్రిల్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి!

ఏప్రిల్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి!

Written By BLOGGEr on Thursday, May 15, 2014 | 10:53 AM

l గ్యాస్ ధరలపై స్పష్టం చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ, మే 14: కేజీ-డీ6 చమురు క్షేత్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న సంస్థలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షాకిచ్చింది. పెంచిన సహజ వాయువు ధరలను ఏప్రిల్ 1 నుంచే అమలు చేస్తామని, అప్పటి నుంచే అధిక చెల్లింపులు జరుపాలని ఆయా సంస్థలకు ఆర్‌ఐఎల్ సూచించింది. కేజీ బేసిన్‌లో రోజుకు ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో 12.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లను యూరియా ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం ఒక్కొ ఎంబీటీయూని 4.205 డాలర్లకు విక్రయిస్తున్నది. నూతన ధరలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగానే వీటిని అమలు పరుస్తామని యూరియా ఉత్పత్తి సంస్థలకు రాసిన లేఖలో ఆర్‌ఐఎల్ పేర్కొంది.

2007లో కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు గ్యాస్ ధరను 4.205 డాలర్లుగా నిర్ణయించింది. ఏప్రిల్ 2009లో ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ మార్చి 31, 2014 నాటికి ఐదేళ్లు పూర్తికావడంతో కేంద్రంపై ఆర్‌ఐఎల్ ఒత్తిడి తీవ్రతరం చేసింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం గ్యాస్ ధరలను ఇంచుమించు రెండింతలు పెంచడంతో 8.3 డాలర్లకు చేరుకోనున్నది. ఈ కొత్త ధరలు అమలైతే ఆర్‌ఐఎల్‌తోపాటు ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు కూడా భారీగా లాభపడే అవకాశం ఉంది.


source: Namasthe telangana
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template